తిప్పతీగ ఇది చాలా మందికి తెలియంది, అయితే దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారుచేస్తారు. ఇది కషాయంలా చేసుకుని తాగితే ఎంతో మంచిది, షుగర్ సమస్య కంట్రోల్ లో ఉంటుంది..తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా పని చేస్తుంది.
రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఇది శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది. ఈ తీగ 4-6 అంగుళాల పొడవైన కాండం పై తొక్క తీసి సగం నీటితో కలిపి రసం నూరుకొని దాన్ని బాగా ఫిల్టర్ చేసి, ఒక చెంచా తేనె కలపి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.
అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి తిప్పతీగకు ఉంటుంది.. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి తిప్పతీగ మందులు బాగా పని చేస్తాయి. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. గర్భిణీలు చిన్న పిల్లలు ఇది వాడకూడదు,బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు దీని వాడకం ప్రయోజనకరంగా ఉంటుంది.