డ్రాగన్ ఫ్రూట్ పేరు కాస్త డిఫరెంట్ గా ఉంది కదా, అవును ఈ ఫ్రూట్ చాలా ఫేమస్ అనేక దేశాల్లో దొరుకుతుంది, అయితే డ్రాగన్ అంటే ముందు మనకు చైనా గుర్తు వస్తుంది, మరి ఈ పండుకి దానికి సంబంధం ఏమిటి అసలు ఇవి తింటే కలిగే లాభాలు ఏమిటి అనేది చూద్దాం.
ఈ పండుకి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ పండు చూడటానికి డ్రాగన్ నోట్లో నుంచి వచ్చే మంటల్లా ఉంటుంది. అందుకే దీనికి డ్రాగన్ ఫ్రూట్ అనే పేరు వచ్చింది. మనకు ఈ పండు ఒక్కొక్కటి 80 నుంచి 100 రూపాయలు ఉంటుంది సైజ్ బట్టీ ధర ఉంటుంది. ఇవి గతంలో అంత అందుబాటులో ఉండేవి కావు … కాని ఇప్పుడు అన్నీ మార్కెట్లో దొరుకుతున్నాయి.. మన దేశంలో అన్నీ ప్రాంతాలకు ఇవి అమ్మకానికి వస్తున్నాయి.
పండు గుజ్జు అరటిపండు గుజ్జులా కొద్దిగా తెలుపుగా ఉంటుంది. అలానే అరటిపండులో ఉన్నట్టుగానే గింజలు ఉంటాయి. ఇందులో సి విటమిన్ ఉంటుంది, అలాగే ఎక్కువ మొతాదులో ఐరెన్ లభిస్తుంది…క్యాలరీలు తక్కువగా ఉండే ఈ ఫ్రూట్ ను రోజు తీసుకుంటే బరువు తగ్గుతారు. …ఇక మలబద్దకం సమస్య ఉండదు కారణం ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, దక్షిణ అమెరికా ఈ పండుకి పుట్టినిల్లు అక్కడ నుంచి ఇప్పుడు అన్నీ దేశాల్లో వీటిని పండిస్తున్నారు.