ఉదయం లేవగానే కచ్చితంగా కాఫీ లేదా టీ తాగేవారు చాలా మంది ఉంటారు… అయితే ఇలా టీ తాగకపోయినా కాఫీ గొంతులోకి పడకపోయినా ఆ రోజు ప్రారంభించడానికి చాలాచిరాకు పడతారు, ఇలా మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు.
అయితే వైద్యులు చెప్పేమాట ఒకటి, కాఫీ తాగద్దు అని చెబుతున్నారు, ముఖ్యంగా రోజుకి ఓసారి తాగితే ఒకేకాని అది కూడా ప్రమాదమే, అయితే రెండు మూడు కప్పులు తాగేవారు వాటిని తగ్గించుకుని పూర్తిగా మానెయ్యడం మంచిది అంటున్నారు..
మీకు తెలుసా ప్రతిరోజు ఐదు కప్పులకు మించి కాఫీ తాగేవారు హృద్రోగాల బారిన పడుతున్నారు, చాలా కేసుల్లో ఇది నిరూపితం అయింది.
కాఫీలో ఉండే కఫెస్టోల్ అనే రసాయన మూలకం కారణంగా కొవ్వు పేరుకుపోతోందని, దానికి తోడు పంచదార యాడ్ అవుతుంది.. ఇది రక్తంలో కలుస్తుంది ఇక కొవ్వు భారీగా పెరగడం ఇలా అనేక సమస్యలు వచ్చి గుండె సంబంధ వ్యాధులు వస్తున్నాయి…ఫిల్టర్ చేయని కాఫీలో ఈ కఫెస్టోల్ అధికంగా ఉంటుందని చెప్పారు.. మన ప్రపంచంలో రోజు 300 కప్పుల కాఫీ తాగుతున్నారు..ఇక ఏడాదికి గుండె జబ్బుల వల్ల రెండు కోట్ల మంది ఆస్పత్రులకి చేరుతున్నారు.