మూత్రం ఆపుకుంటే శ‌రీరంలో ఏమ‌వుతుందో తెలుసా త‌ప్ప‌క తెలుసుకోండి

మూత్రం ఆపుకుంటే శ‌రీరంలో ఏమ‌వుతుందో తెలుసా త‌ప్ప‌క తెలుసుకోండి

0
85

మూత్ర విసర్జన కచ్చితంగా ప్రతీ జీవి చేయాల్సిందే.. సరైన విధంగా రోజూ ఇబ్బంది లేకుండా మూత్ర విసర్జన చేస్తేనే ఆ వ్యక్తి ఆ జీవి ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతారు, లేకపోతే అనారోగ్యంగా ఉన్నట్లే, అయితే మన శరీరంలోని వ్యర్ధాలు అన్నీ మూత్రం ద్వారా బయటకు వస్తాయి అనేది తెలిసిందే..

ఒంట్లో ఉన్న మలినాల్ని కడిగి తనతోపాటు బయటకి తీసుకెళ్ళే ద్రవ పదార్థమే మూత్రం. కాని కొందరు మాత్రం మూత్రం వెంటనే పోయరు , దానిని నిలిపివేస్తారు, ఇది చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు, నిద్రపోయిన సమయంలో చాలా మంది మూత్రం వచ్చినా ఆపుకుంటారు. ఇది కూడా మంచిది కాదు అని చెబుతున్నారు వైద్యులు.

మన మూత్రం శరీరంలోని టాక్సిన్స్ మలీనాల్ని సాధ్యమైనంతవరకు క్లీన్ చేస్తుంది… ఇది కిడ్నీల్లోంచి బ్లాడర్ లోకి వెళుతుంది. మన బ్లాడర్ ఎప్పుడు కూడా ఫుల్ అయితేనే మూత్రాన్ని బయటకి తోయమని ఫోర్స్ చేస్తుంది. మూత్రం వస్తోందన్నట్లు అనిపిస్తేనే అర్థం చేసుకోవాలి.. బ్లాడర్ ఫుల్ అయి పోతుంది దాన్ని ఖాళీ చేయాలి అని. ఇక ఇక్కడ మరో విషయం మన బ్లాడర్ లో 400 మిల్లీ లీటర్ల మూత్రం ఉంటుంది ,అది దాటితే కచ్చితంగా బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతుంది అని చెబుతున్నారు వైద్యులు, ఇలా బ్లాడర్ లో సమస్యలు రావడానికి ఇదే కారణం అని చెబుతున్నారు వైద్యులు, అందుకే మూత్రం ఆపకండి అని చెబుతున్నారు.