నాటు కోడి తింటున్నారా ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

నాటు కోడి తింటున్నారా ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

0
115

చాలా మంది ఇప్పుడు కరోనా సమయంలో మాంస ప్రియులు నాటు కోడిమాంసంపై మొగ్గు చూపుతున్నారు. నాటు కోడి గుడ్డు….మాంసాన్ని బలవర్ధక ఆహారంగా అందరూ అంగీకరిస్తారు,అయితే ఇది బ్రాయిలర్ కోడి కంటే చాలా గట్టిగా ఉంటుంది, అందుకే పిల్లలు కూడా చాలా మంది నాటు కోడి వద్దు అంటారు.

ఇక పెద్దలు కూడా ఈ బ్రాయిలర్ కి అలవాటు పడ్డారు, నాటు కోడి తినడం తగ్గించారు, కాని ఇప్పుడు మల్లీ నాటు కోడికి డిమాండ్ పెరిగింది,బరువు పెరగడానికి బ్రాయిలర్ కోళ్లకు ఇంజెక్షన్లు చేస్తున్నారనే వార్తలు తరచూ చూస్తున్నాం. హార్మోన్ ఇంజెక్షన్లతో నెల రోజుల కోడి పిల్లను రెండు, మూడు కేజీలకు పెంచుతున్న ఘటనలు చూసాము.

అందుకే చాలా మంది నాటు కోడి వైపు మళ్లుతున్నారు, వంద ఎక్కువ అయినా నాటుకోడి కావాలి అంటున్నారు. ఇప్పుడు పెంపకం దార్లు నాటు కోడిని రూ.500 వరకు విక్రయిస్తుంటే.. మార్కెట్లో కిలో కోడిని రూ.700 నుంచి రూ800కు పైగా అమ్ముతున్నారు.నాటు కోళ్లలో తక్కువ ఖర్చుతో ఎక్కువ మాంసం కృతులు లభిస్తాయని అంటున్నారు. నాటుకోడి శరీరానికి మంచిది అని చెబుతున్నారు నిపుణులు.
ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందని జనాలు గట్టిగా నమ్ముతున్నారు.