మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా పని హుషారుగా చేయగలం. అందుకే మంచి పోషకాలు బలమైన ఆహరం తీసుకోవాలి అని చెబుతుంటారు పెద్దలు. ఇక ఆకలిగా ఉంది కదా అని ఇష్టం వచ్చిన రకాల ఫుడ్ తింటే మాత్రం అనారోగ్యం పాలవుతాం. కొన్ని పదార్ధాలను అన్నం తినడానికి ముందు కానీ, భోజనం చేసిన తరవాత గానీ వద్దు అంటున్నారు నిపుణులు.
మరి ఏఏ ఫుడ్ కలిపి తీసుకోకూడదు, ఏవి వెను వెంటనే తినకూడనవి అనేది చూద్దాం
1. తేనే నెయ్యి సుగంధద్రవ్యాలు ఎప్పుడూ కలిపి తీసుకోవద్దు
2. పెరుగు అరటిపండు మజ్జిగ అరటిపండు కలిపి వద్దు
3.రాగి పాత్రలో నిల్వ ఉంచిన నెయ్యిని తినకూడదు
4. చాలా మంది ఉడికిన రైస్ లో పళ్లు వేసుకుని తింటారు ఇది చాలా చేటు కాంబినేషన్
5.కూరగాయలు, వెన్న అస్సలు కలిపి వద్దు
6.చేపల కూర తిన్నవెంటనే పాలు కానీ పెరుగు కానీ కోవా డెయిరీ ప్రొడక్టులు పన్నీరు ఇలాంటివి తీసుకోవద్దు
7. ఆస్తమా ఉన్న వారు చల్లని ఫుడ్ అలాగే టమోటా ముల్లంగికి దూరంగా ఉండాలి
8.మొలలతో బాధపడేవారు గుడ్లు , మాంసం తినకూడదు. చికెన్ మటన్ కి దూరంగా ఉండాలి
9.కారం, మసాలాలు అల్సర్ కడుపు మంట పేగు వ్యాధులు ఉంటే తినవద్దు
10. పొట్లకాయలు, ఎండు చేపలు, శనగలు, బీన్స్, వంకాయ చర్మ వ్యాధులు ఉంటే తినవద్దు