జొమాటో లో ఇకపై ఆర్డర్ చేసేముందు కొత్త ఆప్షన్ – కస్టమర్లు తెలుసుకోండి

New option before ordering in Jomato food delivey app

0
94

మన దేశంలోనే కాదు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది. ఈజీగా ఉంటుంది అని అన్నీంటికి వీటినే ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఇది మానవాళికి చాలా ముప్పు అని మరో పక్క నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలంటే ప్రతీ ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివర్ యాప్ జొమాటో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు తనవంతు కృషి చేస్తోంది. దీనిని అందరూ మంచి నిర్ణయం అంటున్నారు.

మనం చూస్తు ఉంటాం ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో ఎక్కువగా ప్లాస్టిక్తో తయారు చేసిన వస్తువులే వాడతారు. పార్శిల్ ఐటమ్స్, కవర్లు స్పూన్లు ఇలా చాలా వస్తువులు ఉన్నాయి. దీని వల్ల వేస్టేజ్ ఎక్కువ అవుతోంది. జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఈ విషయమై ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

ఇకపై జొమాటో యాప్లో ఆర్డర్ చేసేప్పుడు ప్లాస్టిక్ స్పూన్లు, ఫోర్క్స్ వద్దనుకునే వారి కోసం ఓ ఆప్షన్ను తీసుకొచ్చింది. మీరు ఆర్డర్ చేసే ముందు యాప్ లో ప్లాస్టిక్ స్పూన్లను స్కిప్ చేసే అవకాశాన్ని కలిపించారు. ఒకవేళ మీరు కావాలి అనుకుంటేనే తీసుకోవచ్చు. ఈ నిర్ణయం బాగుంది అంటున్నారు అందరూ. పర్యావరణానికి కూడా ఎంతో మేలు.

https://twitter.com/deepigoyal/status/1432252776893976576