పిల్లలు అస్సలు నిద్రపోవడంలేదని తెల్లవార్లు అదేపనిగా ఏడుస్తున్నారని చాలా మంది తల్లిదండ్రులు చెబుతుంటారు… వారు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు ఒకవేళ కారణం తెలిస్తే దానికి పరిష్కారం చేసే ప్రయత్నం చేయేచ్చు… అయితే ఇదే అంశంపై బ్రిటన్ పరిశోదకులు పరిశోదణ చేశారు… పిల్లలకు మూడు మాసాల వయసు నుంచే తల్లిపాలతో పాటు ఘనాహారంకూడా ఇస్తున్నారో ఆ పిల్లలు హాయిగా నిద్రపోతున్నారని ఆరు మాసాలు వచ్చేదాక పిల్లలకు కేవలం తల్లి పాలు ఇస్తున్నారో వారు ఏడుస్తున్నారని అద్యాయణంలో తేలింది…
చాలమంది తల్లులు ఐదు మాసాల ముందే ఘనాహారం పెడుతున్నారని ఇలా చేయడంవల్ల పిల్లలు తరుచు మేల్కోవడం తగ్గి హాయిగా నిత్రపోతున్నారని తెలిపింది.. తల్లి పాలతో పాటు ఘనాహారంలో పిల్లలకు అవసరమైన శక్తి, పోటాషియం లభిస్తుందని దీంతో వారి పిల్లలు హాయిగా నిద్రపోతున్నారని తెలిపింది..
ఇక తల్లి పాలకే పరిమితం అయిన పిల్లలకు వాళ్ల శరీరానికి అవసరమైన పోషకాలన్నీ వాటి ద్వారా లభిచడం లేదని ఆ కారణంగా పిల్లలు ఏడుస్తున్నారని తెలిపింది…