నోటినుంచి దుర్వాసన వస్తోందా ఇబ్బంది పడుతున్నారా పుదీనాతో ఇలా చేయండి

నోటినుంచి దుర్వాసన వస్తోందా ఇబ్బంది పడుతున్నారా పుదీనాతో ఇలా చేయండి

0
83

చాలా మంది పక్కవారితో మాట్లాడే సమయంలో తమ నోటి నుంచి వచ్చే దుర్వాసన వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు, పక్కవారు కూడా ఈ ఇబ్బంది పడతారు, వారితో వెంటనే మాట్లాడి వెళ్లిపోతారు, అయితే ఇలాంటి సమస్య ఉన్న వారు కచ్చితంగా ఏదైనా తింటే వెంటనే నోరు పుక్కలించుకోవాలి, అలాగే మసాలా ఆయిల్ ఫుడ్ తగ్గించేయాలి. ఇక పుదీనా ఈ సమస్యకు చెక్ పెడుతుంది.

ఈ పుదీనా మంచి వాసన వస్తుంది అంతేకాదు అనేక రకాల ఔషదాలకు ఆయుర్వేదంలో ఇది రారాజు అనే చెప్పాలి, ఇక 12 నెలల్లో ఎప్పుడు ఏ సీజన్ లో అయినా పుదీనా వాడవచ్చు…ఉత్తి పుదీనా ఆకులు తీసుకున్నా మంచిదే..10 పుదీనా ఆకులను ఒక గ్లాసు నీటిలో ఉడకబెట్టి చల్లబరచండి… ఆ నీటితో నోరు శుభ్రం చేసుకోండి. నోటి వాసన తగ్గుతుంది ఇలా ఓ పది రోజులు చేస్తే మీకే రిజల్ట్ తెలుస్తుంది.

ఇలా రోజుకి రెండు మూడుసార్లు పుదీనా ఆకులు తినడం వల్ల దంత సమస్యలు రావు. చిగుళ్ల రక్తస్రావం నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు దగ్గుతో బాధపడుతుంటే పుదీనా ఆకులను టీతో కలిపి తీసుకుంటే సమస్య నుంచి బయటపడతారు. ఇక ఆకలి సమస్య తగ్గిస్తుంది, ఇక రోజుకి రెండు మూడుసార్లు ఇలా పుదీనా ఆకులు తీసుకుంటే ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది.