నూనె ప్యాకెట్లు కొంటున్నారా అయితే మీరు ఇది గ‌మ‌నించండి జాగ్ర‌త్త‌

నూనె ప్యాకెట్లు కొంటున్నారా అయితే మీరు ఇది గ‌మ‌నించండి జాగ్ర‌త్త‌

0
96

ర‌మేష్ రాథోడ్ అనే వ్య‌క్తి హోల్ సేల్ గా ఆయిల్ పాకెట్స్ అమ్ముతాడు అని అంద‌రికి తెలుసు.. అత‌ని ద‌గ్గ‌ర మార్కెట్లో కంటే మూడు లేదా నాలుగు రూపాయ‌లు త‌క్కువ ఉంటుంది అని ఇక్క‌డే కొంటారు, అయితే చాలా మంది అక్క‌డే కొన‌డంతో ప‌క్క వారి వ్యాపారాలు త‌గ్గాయి, అస‌లు ఎలా ఇంత త‌క్కువ‌కి ఇస్తున్నాడు అని వారు ఆశ్చ‌ర్య‌పోయారు.

అయితే అత‌ను చేసే మోసం తెలిసి తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప‌ట్టుకున్నారు బ్రాండెడ్ ఆయిల్ కవ‌ర్లు దొంగ‌త‌నంగా త‌యారుచేసి అత‌ను న‌కిలీ ఆయిల్ అందులో పోసి బ్రాండెడ్ గా అమ్ముతున్నాడట‌.. అయితే ఆయిల్ నుంచి వాస‌న రావ‌డం మ‌డ్డి రావ‌డంతో ఓ వ్య‌క్తి ఫుడ్ సేఫ్టి అధికారుల‌కి కంప్లైంట్ ఇచ్చాడు.

దీంతో ఇత‌ని మోసం వెలుగు చూసింటి.. ఇంట్లో మిష‌న‌రీ పెట్టి సీక్రెట్ గా ఈ దందా ప్యాకింగ్ చేస్తున్నాడు, అత‌నిని వెంట‌నే పోలీసులు అరెస్ట్ చేశారు, మీరు కొనే ఆయిల్ ప్యాకెట్ సీల్ స‌రిగ్గా లేక‌పోయిన, కంపెనీ నేమ్ పై అనుమానం వ‌చ్చినా, క్వాలిటీ తేడా వ‌చ్చిన క‌చ్చితంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ కు కంప్లైంట్ ఇవ్వండి.