ఒమిక్రాన్ కలవరం..ఓకేసారి 33 పాజిటివ్ కేసులు

Omicron disturbance .. 33 positive cases at a time

0
82

దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తమిళనాడులో ఒక్కరోజే 33 కేసులు నమోదయ్యాయి. నైజీరియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు తేలిందని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.

ఆయనతో పాటు ప్రయాణించిన పలువురితో పాటు మొత్తం 89 మందికి ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. పరీక్షించిన నమూనాల్లో 33 నమూనాలకు.. ఫలితం ఒమిక్రాన్ పాజిటివ్​గా వచ్చాయని తెలిపారు. 13 మందికి నెగెటివ్ అని తేలిందని వివరించారు.