పశ్చిమ బెంగాల్‌లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఏడేండ్ల బాలుడికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఆ బాలుడు హైదరాబాద్ మీదుగా బెంగాల్‌కు వచ్చినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో ముర్షిదాబాద్ జిల్లాలోని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
Flash- పశ్చిమ బెంగాల్‌లో ఏడేండ్ల బాలుడికి ఒమిక్రాన్ పాజిటివ్
Omicron positive for Aiden's boy in West Bengal