ఫ్లాష్ న్యూస్: ఒమిక్రాన్ టెన్షన్..ఆ 10 మంది మిస్సింగ్‌

Omicron tension..those 10 people are missing‌

0
89

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను ఒణికిస్తోంది. ఇండియాలో తొలిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో బృహన్‌ బెంగళూరు మహనగర పాలికే (బీబీఎంపీ) చేసిన ఓ ప్రకటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన 10 మంది విదేశీ ప్రయాణికులు పత్తా లేకుండా పోయినట్లు వెల్లడించింది. ఆరోగ్య శాఖ అధికారులు వీరి జాడ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు బీబీఎంపీ వెల్లడించింది.

ఈ సందర్భంగా కర్ణాటక హెల్త్‌ మినిస్టర్‌ మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వెలుగు చూసిన తర్వాత అక్కడ నుంచి 57 మంది బెంగళూరుకి వచ్చారు. వీరిలో 10 మంది ఆచూకీ లభించడం లేదు. బీబీఎంపీ వారిని వెతికే పనిలో ఉంది. సదరు ప్రయాణికులు ఫోన్‌ నంబర్లు స్విచ్ఛాఫ్‌ వస్తున్నాయి. వారు ఇచ్చిన అడ్రెస్‌కు వెళ్లి చూడగా.. అక్కడ ఎవరూ లేరు. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు.

ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్​పై పని చేయవని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ స్పైక్ ప్రొటీన్​లోని కొన్ని ఉత్పరివర్తనలు ప్రస్తుత టీకాల సామర్థ్యాన్ని తగ్గించవచ్చు. అయితే టీకాలు కొంతవరకు వైరస్​ నుంచి రక్షణ కల్పిస్తాయని నిపుణలు భావిస్తున్నారు. ఏదేమైన టీకా తీసుకోవడం మేలు.