చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్‌..దేశంలో మొత్తం కేసులు ఎన్నంటే?

Omikran spreading like water under the carpet..what are the total cases in the country?

0
71

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలకు పాకగా..మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 200 దారినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.

అత్యధికంగా మహారాష్ట్రలో 54, దిల్లీలో 54 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు వెలుగుచూసినట్లు తెలిపింది. ఒడిశాలో కూడా రెండు ఒమిక్రాన్​ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 202గా ఉంది.

తొలిసారిగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్‌.. దాదాపు 100 దేశాలకు పైగా పాకింది. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో ఒమిక్రాన్ ఉద్ధృతి విపరీతంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు బ్రిటన్‌లో వెలుగుచూస్తున్నాయి.