ఒమిక్రాన్ విజృంభణ..సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Supreme Court is a key decision .. the reason for the increase in cases!

0
89

ఓ వైపు ఒమైక్రాన్ వేరియంట్, మరోవైపు కరోనా దేశాన్ని వణికిస్తున్నాయి. తాజాగా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాల పాటు కేసుల భౌతిక విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తిరిగి జనవరి 3 నుంచి వర్చువల్ విధానంలోనే విచారణ కొనసాగించాలని నిర్ణయించింది.

రెండు వారాల తర్వాత సమీక్షించి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్టు అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. కోర్టు తాజా నిర్ణయాన్ని బార్ అసోసియేషన్ సహా అన్ని ఇతర పార్టీలకు తెలియజేసినట్టు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ చిరాగ్ భాను సింగ్, బీఎల్‌ఎన్ ఆచార్య తెలిపారు. మార్చి 2020 నుంచి అత్యున్నత న్యాయస్థానం వర్చువల్‌గా కేసులను విచారిస్తోంది.

గతేడాది అక్టోబరు 7న సుప్రీంకోర్టు ఓ సర్క్యులర్ జారీ చేస్తూ వారానికి రెండు రోజులు.. మంగళ, బుధవారాల్లో కేసులను భౌతికంగా విచారించాలని ఆదేశించింది. హైబ్రిడ్ విచారణను మాత్రం గురువారానికి ఫిక్స్ చేసింది. వర్చువల్ హియరింగులకు మాత్రం సోమ, శుక్రవారాలను నిర్ణయించింది.