దేశంలో కరోనా మహహ్మారి కేసులు ఇంకా పూర్తిగా తగ్గిపోకముందు కొత్త వేరియంట్ వచ్చి ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను సైతం మరోసారి వణికిస్తోంది. భారత్‌లో ఈ ఒమిక్రాన్ వైరస్ రోజురోజుకు చాపకింద నీరులా వ్యాపిస్తోంది.
తాజాగా తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 12 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 20కు చేరింది. విదేశాల నుండి వచ్చిన వారిలో ఈ వేరియంట్ బయటపడింది.