ఈ పొడితో వంట చేస్తే అదిరే టేస్ట్ మీ సొంతం..!

0
108

మహిళలు ఒక్కోసారి ఎంత ఇష్టంగా వండిన అసలు టేస్ట్ రాదు. అలాంటి వాళ్లకు ఈ పొడి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పొడి ఇంట్లోనే నాటురల్ పద్దతిలో సిద్ధం చేసుకోవచ్చు. ఈ పొడి కొంచెం చల్లితే చాలు సూపర్ టెస్ట్ వచ్చేస్తుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

కూరల పొడి తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు: పల్లీలు 500 గ్రాములు, పచ్చిశనగపప్పు 250 గ్రాములు, కరివేపాకు 1 కప్పు, నువ్వులు 100 గ్రాములు, మినపప్పు 150 గ్రాములు
తయారు చేసే విధానం: పొయ్యి మీద బాండీ పెట్టి వేరుశనగప్పుపు, మినపప్పు వేసి దోరగా వేపించుకోవాలి. ఆ తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేసి వేపించాలి. పచ్చిశనగపప్పు తర్వాత నువ్వులు, కరివేపాకు వేయించండి. మనం వేపించుకున్నవి అన్నీ చల్లారిన తర్వత మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. వంటల్లో ఉప్పులేకుండా..ఈ పొడిని వాడుకోవచ్చు. ఈ పొడి వారం పదిరోజులు నిల్వ ఉంటుంది కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు అంటున్నారు ప్రకృతి వైద్య నిపుణులు.