ఒక్క కరోనా కేసు కూడా నమోదు కానీ దేశాలేవో తెలుసా?

Only one corona case has been registered but do you know which countries ..!

0
106

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ఫస్ట్ వేవ్ నుండి థర్డ్ వేవ్ వరకు రాకాసి మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకుంది. వైరస్‌ భారిన పడనివారంటూ ఉండరేమో అన్నట్లు ఈ వైరస్‌ విజృంభించింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ మహమ్మారికి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయాం… కానీ కొవిడ్‌-19 అడుగుపెట్టని దేశాలు ఇంకా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఉత్తర కొరియా

ఉత్త‌ర కొరియాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా న‌మోదు కాలేద‌ు..ఇదే విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ఇప్పటికీ ఉత్తర కొరియా దేశంలోకి పర్యాటకులను అనుమతించట్లేదు. ఇతర దేశాల నుంచి ఉత్పత్తుల దిగుమతిని నిలిపివేసింది. వ్యాక్సిన్ డోసులను కూడా దిగుమతి చేసుకోకుండా ఉత్తర కొరియా తిరస్కరిస్తూనే వస్తోంది.

తుర్కెమెనిస్థాన్‌..

మధ్య ఆసియా దేశాల్లో ఒకటైన తుర్కెమెనిస్థాన్‌లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ దేశం కాస్పియన్‌ సముద్రం, కరక్కమ్‌ ఎడారి సరిహద్దులుగా కలిగి ఉంది. కరోనా ప్రారంభ దశ నుంచి తుర్కెమెనిస్థాన్‌లోని అధికార ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కరోనాను కట్టడికి చేస్తోంది. విదేశాలకు వెళ్లే విమానాలను తప్ప అన్నీ సరిహద్దులను మూసివేసింది. స్వదేశానికి తిరిగి వచ్చేవారు తప్పనిసరిగా కొవిడ్‌ నెగటివ్‌ సర్టిఫికెట్‌, రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకుంటేనే అనుమతి.

కుక్‌ ఐలాండ్స్‌..

దాదాపు 17 వేల జనాభా కలిగిన కుక్‌ ఐలాండ్స్‌లోనూ రెండేళ్లుగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన దేశాల్లో కుక్‌ ఐలాండ్స్ కూడా‌ ఒకటి. పసిఫిక్‌ మహాసముద్రంలోని ఈ ద్వీప దేశంలో అర్హులైనవారిలో దాదాపు 97 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ కంప్లీట్‌ అయింది. అయితే, రెండేళ్లుగా ఒక్క కేసు నమోదు కాని ఈ దేశంలో తాజాగా తొలి కేసు నమోదు కావడం గమనార్హం. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం నియంత్రణ చర్యలను కట్టుదిట్టం చేయడంతో ఆ తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

టేకెలావ్‌..

హవాయి, న్యూజిలాండ్‌ దేశాల మధ్య ఉన్న చిన్న చిన్న ద్వీపాల సమూహమే టేకెలావ్‌. ఇది ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా పేరు గాంచింది. టేకెలావ్‌లో దాదాపు 68.6 శాతం జనాభాకు రెండు డోసుల టీకాను అందించింది.

తువాలు..

దక్షిణ పసిఫిక్‌లో ఉన్న తువాలు ద్వీప దేశంలోనూ ఒక్క కరోనా కేసు నమోదు కాలేదట.. కరోనా ప్రారంభ దశలోనే కఠినమైన ఆంక్షలు విధించించి.. సరిహద్దులను పూర్తిగా మూసివేసి, ప్రయాణాలను నిషేధించింది. ఏప్రిల్ 2021లో పెద్దఎత్తున వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టింది. కరోనాను దేశంలో అడుగుపెట్టనీయకుండా వ్యూహాత్మకమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.

ఇవేకాకుండా మధ్య పసిఫిక్‌లోని కిరిబిటీ ద్వీప దేశంలోనూ మొన్నటి వరకూ ఒక్క పాజిటివ్‌ కేసూ నమోదు కాలేదు. కానీ, తాజాగా (జనవరి 23న) విదేశాల నుంచి ఈ దేశంలో అడుగుపెట్టిన వారిలో (36 మందికి) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తొలిసారి ఈ దేశంలో లాక్‌డౌన్‌ కూడా విధించింది అక్కడి ప్రభుత్వం.

నౌరు..

ఆస్ట్రేలియాకు ఈశాన్య ప్రాంతంలో మైక్రోనేషియాలో ఉన్న అతి చిన్న ద్వీప దేశం నౌరు. ఈ దేశ మొత్తం జనాభా 10,834 మంది మాత్రమే. 2021లోనే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ పూర్తిచేసి.. 100 శాతం వ్యాక్సినేషన్‌ అందించిన దేశాల జాబితాలో నౌరు నిలిచింది.