ఓట్స్ తింటున్నారా దీని వల్ల కలిగే ప్రయోజనాలు తప్పక తెలుసుకోండి

ఓట్స్ తింటున్నారా దీని వల్ల కలిగే ప్రయోజనాలు తప్పక తెలుసుకోండి

0
135

గతంలో ఓట్స్ అంటే చాలా మంది తినేవారు కాదు ఇప్పుడు ఓట్స్ వల్ల ఉపయోగాలు తెలియడంతో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ తింటున్నారు,వీటిని తినడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. అయితే ఓట్స్ డైలీ ఒకే రకంగా కాదు అనేక రకాలుగా చేసుకుని తినవచ్చు, ఓట్స్ తో దాదాపు 50 రకాలు బ్రేక్ ఫాస్ట్ గా చేసుకోవచ్చట.

ఇక ఓట్స్ లో కార్బ్స్ మరియు ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్లాంట్ కాంపౌండ్స్ లభిస్తాయి..ప్రాసెస్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, అంతేకాదు ఈజీగా కుక్ చేయవచ్చు..ఓట్స్ ను నీళ్ళల్లో గాని పాలలో గాని బాయిల్ చేసుకుంటారు ఓట్ మిల్క్ గా కూడా చాలా మంది తీసుకుంటారు.

దీని వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది అంత తొందరగా ఆకలి వేయదు.. ఇవి తింటే చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుందని చెబుతున్నారు…అలాగే ఓట్స్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువవుతాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఓట్స తినడం మేలు… పిల్లలకు ఇవి అలవాటు చేస్తే ఆస్త్మా రిస్క్ బాగా తగ్గుతుందని చెబుతున్నారు వైద్యులు.

.