చాలా మందికి కూర లేకపోయినా పర్వాలేదు పచ్చడి తొక్కు ఉంటే చాలు అదే పాయసంగా తింటారు, అయితే ఇలా పచ్చళ్లు ఎక్కువ తినేవారికి కడుపులో మంట అసిడిటీ వస్తుంది అనేది తెలిసిందే, అయితే కూరగాయలు పప్పు ఈ ఫుడ్ తో పోల్చితే పచ్చడి కాస్త డేంజర్.
ఏ ఆహారమైన సరే అతిగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రోజుకు ఎంత పచ్చడి తీనాలో తెలుసుకోవాలి. అతిగా పచ్చడి తినకూడదు అంతేకాదు రోజూ పచ్చడి తీసుకోవడం కూడా మంచిది కాదు
ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవాళ్లు పచ్చళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
బీపీ ఉన్నవాళ్లు పచ్చడి ఎంత తక్కువ తీంటే అంత మంచిది. ఎందుకంటే అందులో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్నవారు కూడా రోజుకు ఒక్క ఆవకాయ ముక్క కన్నా ఎక్కువ తీసుకోవద్దు. రెండు మూడు రోజులకి ఓ ఆవకాయ ముక్క తీసుకుంటే మంచిది రోజు రెండు పూటల తింటే మాత్రం డేంజర్.