పచ్చి పులుసు తినడం వలన కలిగే లాభాలు ఇవే తప్పక ట్రై చేయండి

పచ్చి పులుసు తినడం వలన కలిగే లాభాలు ఇవే తప్పక ట్రై చేయండి

0
93

మనలో చాలా మందికి పచ్చి పులుసు తెలియకపోవచ్చు.. కాని ఇది తింటే మాత్రం ఎవరూ వదిలిపెట్టరు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే పెద్దలు కూడా ఈ పచ్చిపులుసు ప్రతీ వారం చేసేవారు, మరి దీని వల్ల లాభాలు ఏమిటో చూద్దాం.

ఎలా చేసుకోవాలి అంటే, పిక్కలు లేని చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. ఇక ఇందులోకి పోపులు కడాయిలో వేసి
నూనె ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి.. వేయించి పోపు పెట్టాలి ఇందులో సరిపడా ఉప్పు వేయాలి, పైన కొత్తిమీర చల్లితే ఆ టేస్ట్ అదిరిపోతుంది.

దీని వల్ల ఒంటికి చలువు చేస్తుంది
ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు దీని వల్ల కడుపులో నొప్పి అలాంటి సమస్యలు ఉండవు
చింతపండులో విటమిన్-సి రోగనిరోధకతను పెంచుతుంది.
దగ్గు, జలుబు నుంచి రక్షణ పొందవచ్చు.
కాళ్లు కీళ్లు నొప్పులు ఉండవు
ఆవాలు తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ సమస్యలు ఉండవు
జీలకర్ర తినడం వల్ల శ్వాన కోశ సమస్యలు రావు
ఇంకెందుకు ఆలస్యం రెసిపీ ఇలా ట్రైచేయండి.