పాలకూరలో పాము – ఆకుకూరలు కొంటున్నారా ఇది చూడండి

పాలకూరలో పాము - ఆకుకూరలు కొంటున్నారా ఇది చూడండి

0
112

ఈ మధ్య మనం కూరగాయలు చాలా వరకూ ఒకేసారి కొనుగోలు చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటున్నాం, ఇక ఇలా చేయడం వల్ల ప్రతీసారి కూరగాయలకు వెళ్లక్కర్లేదు అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది, అయితే ఇలాగే ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నివసించే భార్యాభర్తలిద్దరూ సరుకులు, కూరగాయలు తెచ్చుకోవటానికి సూపర్ మార్కెట్ కు వెళ్లారు.

 

ఇక అన్నీ తెచ్చుకున్నారు ఇక కూరలు సర్దుదాం అని భార్య భావించి ఒకొక్కటి తీసింది..ఈ సమయంలో పాలకూర కట్టలు పెట్టిన కవర్ లోంచి బుస్ బుస్ మంటూ ఓ పాము బైటకొచ్చింది. ఇక భార్య భర్తలు ఇద్దరూ షాక్ అయ్యారు, ఆ పాల కూర ప్యాకెట్ లో అది బుసలు కొడుతూ ఉంది.

 

సుమారు 7.8 అంగుళాల పాము బైటకొచ్చింది. అది తాచుపాము దీంతో వారు బెంబెలెత్తిపోయారు. వారు అది సరిగ్గా చూడకుండా ఓపెన్ చేసి ఉంటే పాము కాటు వేసేది, దీనిపై వెంటనే అక్కడ షాపు వారికి చెప్పారు.. వెంటనే వారు వచ్చి ఆ ప్యాకెట్ చూసుకున్నారు ఇక అధికారులకి చెప్పడంతో ఆ పాముని పట్టుకున్నారు. మొత్తానికి ఆ షాపులో సూపర్ మార్కెట్లో మిగిలినవి అన్నీ ప్యాకెట్ల కూడా చెక్ చేస్తున్నారు అధికారులు.