పాకిస్థాన్ లో పారాసిటమాల్ కష్టాలు..అల్లాడిపోతున్న ప్రజలు

Paracetamol problems in Pakistan

0
74

జ్వరం వస్తే వెంటనే గుర్తొచ్చే ట్యాబ్లెట్ పారాసిటమాల్, డోలో 650. అందుకే ప్రతి ఇంట్లో పారాసెటమాల్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ ట్యాబ్లేట్లు ప్రతి మెడికల్ షాపులో ఈజీగా దొరుకుతాయి. అయితే ఓ దేశంలో మాత్రం ఈ టాబ్లెట్ల కొరతతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. ఆ దేశం మరేదో కాదు మన దాయాది దేశం పాకిస్థాన్ లోనే.

కాగా ప్రస్తుతం పాకిస్థాన్‌లో కోవిడ్ ఐదో వేవ్ నడుస్తోంది. ఇప్పటికే అక్కడ లక్షకుపైగా కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి జాతీయ పాజిటివిటీ రేటు 9.65 శాతంగా నమోదైంది. రోజుకు 20కి దగ్గరగా కోవిడ్ మరణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశంలో కేసులు, డెంగ్యూ కేసులు విజృంభిస్తున్నాయి. దాంతో ట్యాబ్లెట్ల కొరత ముప్పుగా మారింది.

ఈ విషయాన్ని డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్థాన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. అలాగే డిమాండ్ కు తగ్గట్టుగా ట్యాబ్లెట్లను అందుబాటులో ఉంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ట్యాబ్లెట్లను సకాలంలో తయారు చేసి అందించడంలో 15 ఫార్మా కంపెనీలు విఫలం అయ్యాయి. దాంతో ఆ కంపెనీలకు మంగళవారం డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్థాన్ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.