తలలో పేలు ఎలా వస్తాయి అమ్మాయిలు ఈ జాగ్రత్తలు తీసుకోండి

తలలో పేలు ఎలా వస్తాయి అమ్మాయిలు ఈ జాగ్రత్తలు తీసుకోండి

0
101

తలలో పేలు చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, మరీ ముఖ్యంగా మహిళలకు ఈ సమస్య దారుణంగా ఉంటుంది. ఇక చాలా మంది అబ్బాయిలకి కూడా ఈ సమస్య చిన్నతనంలో ఉంటుంది, అయితే పెద్ద అయ్యాక ఈ సమస్య అంత ఉండదు, ఇలా తలలో పేలు ఎందుకు వస్తాయి అనేది చూద్దాం.

గుడ్ల నుంచి పేలు పుడతాయి. ఆ గుడ్లను నిట్ అంటారు.మనిషి రక్తమే పేలకు ఆహారం. అవి మన తల మీద జుట్టు మధ్యలో తిరుగుతూ రక్తాన్ని పీల్చుతాయి. ముఖ్యంగా పేలు ఒకరి నుంచి మరొకరిని తల తాకిన సమయంలో వస్తూ ఉంటాయి, చిన్నపిల్లలు ఎక్కువగా ఆట ఆడిన సమయంలో పక్క పక్కన ఉన్న సమయంలో ఇలా పేలు వస్తాయి.

పొడవాటి జుట్టు ఉండటం కూడా పేలు వ్యాప్తి చెందడానికి మరో కారణం. ఇక అమ్మాయిలు సెల్పీలు తీసుకునే సమయంలో తలలు కలిసేలా ముందు తీసుకుంటారు.. ఇలాంటి సమయంలో పేలు ఈజీగా పక్క వారి తలలోకి వెళతాయి..తల్లో పేలు ఎగరలేవు, దూకలేవు. కొత్త వ్యక్తి జుట్టు తాకగానే.. ఆ వెంట్రుకలను పాకుతూ వెళ్లిపోతాయి. తల మీదకు చేరి గుడ్లు పెడతాయి.
ఇక పిల్లలు కుక్కల వెంట్రుకల్లో కూడా పేలు ఉంటాయి. అందుకే అతిగా తలని జుట్టుని పక్కవారికి ఆన్చద్దు అంటున్నారు నిపుణులు, ఇలా తలలోకి వెంట్రుకల ద్వారా పేలు వస్తున్నాయి.