ఆ నీరు తాగితే చచ్చిపోతున్న జనం – తాగద్దు స్నానం చేయద్దు అంటున్న వైద్యులు

-

నీరు ప్రాణాదారం అలాంటి నీరు తాగితే చనిపోవడం ఏమిటి అని అనుకుంటున్నారా, అవును మీరు విన్నది నిజమే. నీరు తాగకుండా మనిషి ఎక్కువ కాలం జీవించడం అసాధ్యం. మన శరీరంలో కూడా ఎక్కువ శాతం నీరే ఉంటుంది. మరి అలాంటి నీరే అక్కడ గరళం అవుతోంది.

- Advertisement -

అమెరికాలోని టెక్సాస్లో ట్యాప్ వాటర్ తాగిన వారు శరీరంలోకి భయంకరమైన సూక్ష్మజీవులు వెళ్లడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. అంతేకాదు ఆ క్రిములు రక్తంలో చేరి శరీరం అంతా తిరిగి అవయవాలపై అటాక్ చేస్తున్నాయి.

చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు, తాజాగా ఆరేళ్ల బాలుడు ఈ సూక్ష్మజీవి వల్ల చనిపోవడంతో ఈ సూక్ష్మజీవిని సీరియస్ గా పరిగణించాల్సి వస్తోంది. అమీబా లాంటి సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించి మనిషి ప్రాణాలు పోవడానికి కారణమైందని వెల్లడించారు, అంతేకాదు తాగడానికే కాదు వాష్ రూమ్ కి, అలాగే స్నానానికి కూడా ఈ నీరు వద్దు అంటున్నారు.. బ్రజోరియా కౌంటీలోని లేక్ జాన్సన్లోని ట్యాప్ వాటర్ ద్వారా సూక్ష్మజీవులు మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టు అధికారులు తేల్చారు… ఇక ఇలా లక్షణాలు కొందరికి కనిపించాయి, వారికి జ్వరం రావడం మెదడు సమస్యలు రావడం గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...