చేపలు అధికంగా తినే వారికి ఈ సమస్యలు దరిచేరవు..!

0
98

మానవులకు లభించే ముఖ్యమైన మాంసహార పదార్థాల్లో చేపలు ఒకటి. మాంసాహారంలో చేపలను ఎక్కువమంది ఇష్టపడతారు. ఈ చేపలతో ఎన్నో రకాల డిషెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చేపలు తీనుకుంటే చక్కని ఫలితాలు పొందవచ్చు. ఇది అధికంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

చేపలను ఎక్కువగా తినడం వల్ల వాటిల్లో ఉండే డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. చేపలు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.

చేపలతో మానసిక ఆందోళన తగ్గుతుందని, ప్రతి రోజు ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించేందుకు చేపలు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా ఉండాలన్నా.. ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా.. తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.