ఈ సమస్యలు ఉన్న వారు అస్సలు కాఫీ తాగద్దు గర్భిణీలు ఇది తెలుసుకోండి

మితంగా తీసుకుంటే పర్వాలేదు కాని అతిగా తాగకూడదు.

0
112

ఉదయం లేవగానే మనలో చాలా మంది కాఫీ టీలు తాగుతారు. కొందరు అయితే రోజుకి రెండు మూడు కప్పుల కాఫీ తాగుతారు.ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లు ఇక మాటిమాటికి కాఫీ టీ తాగుతూనే ఉంటారు. వర్క్ ప్రెజర్ లో కాఫీ టీలు అలవాటు అవుతున్నాయని అంటారు. వీటిని మితంగా తీసుకుంటే పర్వాలేదు కాని అతిగా తాగకూడదు.

రోజూ ఓ కప్పు, రెండు కప్పులు ఓకే కానీ అంతకు మించి కాఫీలు తాగితే మాత్రం లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు గర్భధారణ సమయంలో కాఫీ తాగడం మంచిది కాదు. ఇందులో కెఫిన్ ఎక్కువ ఉంటుంది దీని వల్ల శరీరంలో ఎదుగుతున్న పిండానికి రక్తం సరఫరా అవ్వడంలో సమస్యలు వస్తాయి.

మైగ్రేన్ సమస్యతో బాధపడుతుంటే అలాంటి వారు కాఫీ తాగొద్దు. కాఫీ తాగడం వల్ల రక్తపోటు స్థాయి మరింత పెరుగుతుంది. డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్న వారు కూడా కాఫీకి దూరంగా ఉంటే మంచిది అని చెబుతున్నారు వైద్యులు.