చాలా మంది పెద్దలు ఓ మాట చెబుతారు. జలుబు దగ్గు కఫం ఇవన్నీ తగ్గాలి అంటే పసుపు పాలు తాగండి అని. అయితే ఇది మంచిదే పసుపు పాలు తాగితే ఈ సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ పాలు అందరూ తాగకూడదు అంటున్నారు నిపుణులు. ఎందుకు అంటే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఈపాలు తాగితే సమస్యలు వస్తాయట.
ముఖ్యంగా చెప్పేది కాలేయానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్న వారు నిపుణుల సలహా లేకుండా పసుపు పాలను ఎప్పుడూ తాగకూడదు.
ఇక ఎవరు ఈ పసుపు పాలు తీసుకోకూడదు అంటే చూద్దాం.
1.కాలేయానికి సంబంధించి సమస్యలు ఉండి మెడిసన్స్ వాడుతుంటే వారు ఈ పాలు తాగవద్దు.
2.రక్తహీనత ఉన్నవారు కూడా పసుపు పాలు తాగకూడదు.
3. ఐరన్ లోపంతో బాధపడుతున్న వారు కూడా పసుపు పాలు తీసుకోవద్దు అంటున్నారు.
4.గర్భిణీ స్త్రీలు పసుపు పాలు తాగకూడదు.
5. కడుడు నొప్పి, గ్యాస్ సమస్యలు ఉన్న వారు కూడా పసుపు పాలు తీసుకోవద్దు.
6. శరీరం కొందరికి వేడి అనిపిస్తుంది అలాంటి వారు పసుపు పాలకు దూరంగా ఉండాలి.
7. పిత్తాశయంలో రాయి ఉంటే మీరు పసుపు పాలు తీసుకోవద్దు.