పీరియడ్స్ టైమ్ లో బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోండి

పీరియడ్స్ టైమ్ లో బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోండి

0
89

పీరియడ్స్ టైమ్ లో ఆ ఐదు రోజులు మహిళలు చాలా నరకం అనుభవిస్తారు,ఇక ఉద్యోగం వ్యాపారం చేసే మహిళలకు చేతులెత్తి మొక్కాలి అలా ఎంత పెయిన్ ఉన్నా వారు ఆ బాధని అణుచుకుంటూ పని చేస్తారు, అయితే పిరియడ్స్ టైమ్ లో కొందరికి ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, తరచూ వారు ప్యాడ్స్ కూడా మార్చుకుంటూ ఉంటారు.

ఈ సమయంలో కొన్ని ఆహర అలవాట్లు కూడా మార్చుకోవాలి అని చెబుతున్నారు వైద్య నిపుణులు.
పీరియడ్స్ మీకు మూడు లేదా ఐదు రోజులు కనిపిస్తే మీరు రోజుకి కచ్చితంగా ఐదు లీటర్ల నీరు తాగాలి, డ్రింకులకు దూరంగా ఉండాలి, మసాలా ఫుడ్ ని ఈ ఐదు రోజులు అవాయిడ్ చేయాలి. ఇక ఉప్పు కలిపిన నీరు కూడా రోజుకి ఓసారి తీసుకోండి.

ఇక విటమిన్ సీ ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవడం మంచిది.. ఐరన్ సరిగ్గా ఉండడం వల్ల ఎనీమియా రాకుండా ఉంటుంది. ఐరెన్ మందులు ఫుడ్ తీసుకోవడం మంచిది..క్యాప్సికమ్, కివీ, స్ట్రాబెర్రీస్, బ్రకోలీ, టొమేటో నిమ్మ లో విటమిన్ సీ ఉంటుంది. ఇదికచ్చితంగా తీసుకోండి. అలాగే చికెన్, బీన్స్, టోఫూ, పాలకూర ఎక్కువగా తీసుకోండి వీటిలో ఐరెన్ ఉంటుంది, ఇవి తీసుకుంటే ఐరెన్ లోపం లేకుండా ఉంటుంది మీకు.