పందికళేబరాలతో హైదరాబాద్ లో వంట నూనె ఎక్కడో తెలుసా ప్రజలారా జాగ్రత్త

పందికళేబరాలతో హైదరాబాద్ లో వంట నూనె ఎక్కడో తెలుసా ప్రజలారా జాగ్రత్త

0
94

చాలా మంది ఇప్పుడు కాసుల కోసం కక్కృత్తి పడుతున్నారు.. దీని వల్ల చాలా మంందికి ఆరోగ్యం కూడా నాశనం అవుతోంది.. అయితే వారి జేబులు నింపుకోవడానికి ఆయిల్ కల్తీ చేస్తున్నారు.. ఇలా చేయడం వల్ల కొన్ని వందల మంది ప్రాణాలకు ముప్పు వస్తోంది, అయితే ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వారి మోసాలు అప్పుడప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడుతున్నాయి.

కాని తాజాగా జంతువుల ఎముకలు వాటి కుళ్లిపోయిన కలేబరాలతో నూనెలు తయారు చేస్తున్నారు కొందరు..తాజాగా హైదరాబాద్ నగర శివారు కొత్తూరులో ఇలాంటి దారుణ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. తయారీ కేంద్రం నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అధికారులు ఇక్కడ సోదాలు చేస్తే ఈ దారుణాలు కనిపించాయి.

పందుల కళేబరాలతో కల్తీ నూనె తయారు చేస్తున్నట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది… తిమ్మాపూర్లోని హరి ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జంతు కళేబరాలు, చనిపోయిన పందులతో కల్తీ నూనె తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో వెలుగులోకి వచ్చింది ఈ దందా, చూశారుగా లూజ్ నూనెలు వాడేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నారు అధికారులు, వాడే నూనె తేడా వస్తే వెంటనే అధికారులకి సమాచారం ఇవ్వాలి అని చెబుతున్నారు.