కాస్త గుడ్ న్యూస్ ఏమిటి అంటే అతి చిన్న పిల్లలకు కరోనా సోకడం చాలా తక్కువ అంటున్నారు, ఇది మంచి వార్తే, కాని వారి నుంచి పెద్దలకు కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది అంటున్నారు, ఇంటిలో హోం ఐసోలేషన్ లో ఉన్నవారు చిన్నపిల్లలకు దూరంగా ఉండండి అని చెబుతున్నారు వైద్యులు.
చిన్న పిల్లలకి కొవిడ్-19 సోకే చాన్స్ తక్కువే, కానీ వారు పెద్ద వారిలాగే వైరస్ ని స్ప్రెడ్ చేయగలరు. అనుమానంగా ఉన్న వారు తాకిన ఏ వస్తువునీ చిన్న పిల్లలు తాకకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి
కచ్చితంగా ఆ ఫ్లోర్ వస్తువులు డైలీ శానిటైజేషన్ చేయాలి.
కచ్చితంగా పిల్లలను ముట్టుకుంటే ఇంట్లో పెద్దలు కూడా సబ్బుతో చేతులు కడుక్కోవాలి..
ఒక వేళ తల్లికి కనుక కరోనా సోకితే ఆమె ఫేస్ మాస్క్ వేసుకుని బిడ్డని తాకాలి, ఇక పిల్లలకు పాలిచ్చే తల్లులు ఆందోళన వద్దు, తల్లికి కరోనా వైరస్ ఉన్నా సరే వారు బిడ్డకి పాలివ్వచ్చని స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
వెయ్యిమంది తల్లుల్లో కేవలం ముప్ఫై మూడు మంది మాత్రమే పిల్లలకి వైరస్ ని ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా ఫేస్ మాస్క్ ధరించకపోవడం కారణం అని తెలిపారు సర్వేలో, అందుకే పిల్లల విషయంలో వారిని బయటకు తీసుకువెళ్లవద్దు. ఇష్టం వచ్చిన బయట ఫుడ్ కూడా వారికి ఇవ్వద్దు అంటున్నారు వైద్యులు.