త్వరలో మార్కెట్ లోకి పింక్, పసుపు టమాటోలు..ధర ఎంతంటే?

0
108

టమాటాల గొప్పతనం గురించి ఎంత చెప్పిన తక్కువే. అందరు ఎంతో ఇష్టంగా తినే కూరగాయలలో టమాటో తప్పనిసరిగా ఉంటుంది. త్వరలో మార్కెట్లోకి పసుపు, పింక్ కలర్ టమాటాలు కూడా వస్తున్నాయి. ఇవి థాయ్‌లాండ్, మలేషియా, ఐరోపాలో ప్రసిద్ధి చెందిన పింక్ టొమాటో.. త్వరలో భారతదేశంలో కూడా రాబోతోంది. దాంతో ప్రజలు త్వరలో  పసుపు, పింక్ కలర్ టమాటాలు తినే మహా భాగ్యం పొందపోతున్నారు.

నీటిలో కరిగే ఆంథోసైనిన్ వర్ణద్రవ్యం ఈ టమాటాలకు అధికంగా ఉంది. అంతేకాదు ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఎరుపు టమోటాలలో పుష్కలంగా ఉన్న లైకోపీన్ పిగ్మెంట్.. ఈ పింక్ టమాటాలో తక్కువ సాంద్రతతో ఉంది. ఈ పింక్ టమాటా రకాన్ని 150-180 రోజులు సాగు చేస్తారు. 55 రోజులలో పంట చేతికొస్తుంది. అయితే కిలోకు దాదాపు రూ. 25-30 ఖర్చవుతుంది. ఇది ప్రస్తుతం ఎర్ర టమోటా పంట ధర కంటే తక్కువే.

పింక్ టమాటా: ఈ టమాటా స్కిన్ చాలా సున్నితంగా పలచగా ఉంటుంది. దీంతో ఈ పింక్ టమాటాలు రవాణా చేసే సమయంలో పాడయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.. అంతేకాదు నిల్వ ఉండే రోజులు కూడా తక్కువే. ఏడు రోజులు మాత్రమే వీటి జీవితం. ఒక్క నిల్వ ఉండకపోవడం తప్ప దీని వల్ల అన్ని లాభాలే. ఈ టమాటాలు పూరీ కూర, సాంబారు, చట్నీలకు అనువైనది.
పసుపు టమాటో: ఈ రకంలో బీటా కెరోటిన్, ప్రొవిటమిన్ A ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ పసుపు టమాటాతో చేసిన వంటలు బంగారు రంగులో ఉంటాయి.. ఈ టమాటాల్లో ఎరుపు టొమాటోలలో ఉండే ఆస్కార్బిక్ యాసిడ్ లేని కారణంగా, ఈ రకం సంప్రదాయ టమోటాల కంటే బచ్చలికూరతో కలిపి వండితే మంచి రుచిగా ఉంటుంది.