ప్లాస్టిక్ కప్పుల్లో టీ కాఫీ తాగుతున్నారా అయితే ఇది తెలుసుకోండి ఎంత డేంజరో

ప్లాస్టిక్ కప్పుల్లో టీ కాఫీ తాగుతున్నారా అయితే ఇది తెలుసుకోండి ఎంత డేంజరో

0
116

టీ తాగే సమయంలో ప్లాస్టిక్ కప్పులు వాడకూడదు అని ఇప్పటికే వైద్యులు చెబుతున్నారు, అంతే కాదు ఇలా డిస్పోజబుల్ గ్లాసులు వాడకం కూడా ఇటీవల పెరిగితే దీనిని కూడా చాలా వరకూ తగ్గించారు, మొత్తానికి ఇప్పుడు ఎక్కడ చూసినా పేపర్ కప్పులు కనిపిస్తున్నాయి. వీటిని కూడా వాడద్దు అని తెలియచేస్తున్నారు వైద్యులు.

పేపర్ కప్పు కూడా ప్రమాదమేనని, ప్లాస్టిక్ కప్పుల వలే ఇవి డేంజర్ అని చెబుతున్నారు నిపుణులు, ఇందులో కాఫీ టీ పాలు తాగితే కడుపులో ప్రమాదం వస్తుంది.. ఇలాంటి వాటిలో తాగితే 75 వేల అతిసూక్ష్మ హానికర ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోనికి వెళతాయి అని దీని వల్ల అనారోగ్యం వస్తుంది అంటున్నారు నిపుణులు.

ఇలా ప్లాస్టిక్ వాటిలో వేడివి తాగితే, అందులో క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత లోహాలు శరరీంలోకి వెళ్తాయని,దీని వల్ల పేగులపై కడుపులో ప్రభావం చూపిస్తుంది అంటున్నారు.. ఇలా రోజూ వీటిలో తాగుతూ ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు.