బంగాళదుంపతో పాలు – మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి మరి తెలుసుకోండి

Potato milk-coming on the market

0
102

మనం చాలా రకాల పాలు విన్నాం ఇదేంటి బంగాళదుంప పాలు అని ఆశ్చర్యపోతున్నారా ? ఇప్పటికే మార్కెట్లోకి ఆలూ పాలు వచ్చేశాయి. గేదె పాలు, ఆవు పాలు, మేక పాలు, బాదం పాలు, జీడిపప్పు పాలు, సోయా పాలు అలాగే బంగాళాదుంపల పాలు టేస్ట్ చూస్తున్నారు జనం. స్వీడన్ కి చెందిన ఓ కంపెనీ ఆలూ పాలను తయారుచేస్తోంది. ఇక కంపెనీ ఈ పాలు ఎలా తయారు చేస్తున్నారు అనేది టాప్ సీక్రెట్ గా ఉంచింది.

మామూలు పాల కంటే ఇవి చాలా చిక్కగా ఉంటున్నాయి. ఇవి లైట్ బిస్కెట్ కలర్ లో ఉంటాయి. కంపెనీ DUG బ్రాండ్ పేరుతో వీటిని అమ్ముతోంది. ఆవు పాలు, బాదం పాలు, ఓట్ మిల్క్ కంటే ఈ పాలు రుచి అలాగే శరీరానికి మంచిది అంటున్నారు.

బంగాళ దుంప నుంచి ద్రవాన్ని తీసి వేరుశనగ గింజల ప్రోటీన్, పిండి పదార్థం లాటి మాల్టోడెక్స్ట్రిన్, చికోరీ ఫైబర్, రేప్సీడ్ ఆయిల్, నేచురల్ ఫ్లేవర్లు కలుపుతున్నారు. ఆ తర్వాత ఈ పాలు తయారు అవుతున్నాయి. ఈ పాలలో విటమిన్ D, B12, ఫోలిక్ యాసిడ్ లు ఉంటున్నాయి. ఇక మార్కెట్లో ఈ పాలు దొరకడంతో చాలా మంది టేస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పాలు సలాడ్లు, జ్యూస్ లు , కూల్ డ్రింక్స్ లో కలుపుకొని తాగుతున్నారు. దీనితో కాఫీ కూడా చేసుకుంటున్నారు.