పొట్ట దగ్గర కొవ్వు – బరువు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి

పొట్ట దగ్గర కొవ్వు - బరువు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి

0
96

చాలా మంది పొట్ట దగ్గర కొవ్వుతో ఇబ్బంది పడుతూ ఉంటారు, ముఖ్యంగా ఇది కొవ్వుగా మారి బరువు కూడా పెంచుతుంది, అయితే వయసు పెరిగే కొలది పొట్ట కూడా కొందరు పెరిగినా పట్టించుకోరు. ఇది చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు.

జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటే పొట్ట పెరిగిపోతుంది. ఇంకా సరైన వ్యాయామం లేకపోవడం ద్వారా పొట్ట తగ్గదు. అయితే ఈ పొట్ట తగ్గాలి అంటే వాము కూడా తినడం మంచిది.. వాము తినడం వల్ల పొట్ట సమస్య తగ్గుతుంది.

మీరు ఓ లీటర్ నీరు తీసుకుని అందులో చిన్న స్పూన్ తో వాము వేసి ఆ నీటిని పొయ్యి పై పెట్టి మరిగించండి. ఆనీరు చల్లారిన తర్వాత కొంచెం కొంచెం రోజంతా తాగుతూ ఉండండి, ఇక పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది, అలాగే బరువు తగ్గుతారు. అలాగే సబ్జాగింజలను నానబెట్టి ఆ వాటర్ తాగినా చాలా మంచిది. ఆ సబ్జా గింజల్లో అధికంగా షుగర్ వేసుకోకుండా తీసుకోండి. ఇక పెసలు కూడా తీసుకున్నా మంచిదే దీని వల్ల బరువు తగ్గుతారు కొవ్వు పెరగదు, గోదుమ రవ్వతో చేసిన ఆహారం కూడా పొట్ట అధిక బరువు తగ్గిస్తుంది.