ఆ బాటిల్ లో నీళ్లు పోసి ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా? అయితే ఇవి తెలుసుకోండి..

0
83

సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే చాలు..చల్లటి నీళ్ళు తాగడానికి ప్రజలు మొగ్గుచూపుతుంటారు. అందుకు చాలామంది  అయిపోయిన వాటర్ బాటిల్స్ లో లేదా కూల్ డ్రింక్ బాటిల్స్ లో వాటర్ పోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగుతారు. కానీ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అవేంటో మీరే చూడండి..

ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు పోసి ఎక్కువ రోజులు అలానే  ఉంచి తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం ఫ్లోరైడ్ మరియు ఆర్సెనిక్ అందులో ఫామ్ అయ్యి..స్లో పాయిజన్ అవుతుంది. దానివల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని సైంటిస్టులు అంటున్నారు.

ఎక్కువ కాలం పాటు ప్లాస్టిక్ బాటిల్స్ ని ఉపయోగించడం వల్ల బీపీ ఏ ప్రొడ్యూస్ అవుతుంది.  దీని వల్ల ఊబకాయం డయాబెటిస్ మొదలైన సమస్యలు కలుగుతాయి అందుకే వీలైనంత వరకు ఈ తప్పులు చేయకుండా ఉంటే మంచిది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిపై కూడా ఎఫెక్ట్ పడుతుందంటున్నారు నిపుణులు.