కోవిడ్ 19 పేరువింటేనే భయపడే పరిస్థితులు ఇవి… రెండు వారాల క్రితం వరకు మనదేశంలో వైరస్ తగ్గుముఖం పడోతుందని భావన ఉండేది… లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో జనం అంతా ఒక్కసారిగా బయటకు రావడంతో కేసులు సంఖ్య అమాంతం పెరిగిపోతుంది…
ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగితా సమయంలో ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలని అంటున్నారు… కానీ ఏదో ఒక పని మీద వెళ్లాల్సి వస్తుంది… అప్పుడు మీరు వైరస్ మీ ఇంటికి తీసుకురాలేదని నిర్దారించుకోవడానికి ఈ క్రిందిసూచనలు పాటించాలి…
బయటకు వెళ్లిన ప్రతి సారి మాస్క్ పెట్టుకోవాలి…
ఇతరులకు మీకు కనీసం ఆరు మీటర్లు ఉండేలా చూసుకోండి..
ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చేతులను సబ్బుతో 20 నిమిషాలు కడుక్కోండి…
బయట నుంచి తెచ్చిన కూరగాయలను బాగా కడగాలి..
తాకిన ప్రతి సారి శానిటైజ్ చేసుకోవాలి…