ఏ మహిళకి అయినా వివాహం అయిన తర్వాత అమ్మ అవ్వాలి అని కోరిక ఉంటుంది, అమ్మతనం అంత మధురమైనది, అయితే ఈ సమయంలో రెండు ప్రాణాలు జాగ్రత్తగా చూసుకోవాలి, ఒకటి తల్లి రెండు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ, అయితే కచ్చితంగా ఈ సమయంలో ప్రతీదీ జాగ్రత్త తీసుకోవాలి.
అయితే ప్రెగ్మెంట్ అయిన మహిళల్లో కొన్ని లక్షణాలు డేంజర్ గా కనిపిస్తూ ఉంటాయి, అలాంటి వాటిని అశ్రద్ద చేయవద్దు అంటున్నారు వైద్యులు, మరి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలి మరి ఆ జాగ్రత్తలు లక్షణాలు ఏమిటో చూద్దాం.
1.. తరచూ పొత్తికడుపులో నొప్పి రావడం
2. రోజుకి రెండు మూడుసార్లు వాంతులు అయితే అది డేంజర్ కచ్చితంగా చూపించుకోవాలి
3. తిన్నా వెంటనే వాంతులు అవ్వడం
4. లూజ్ మోషన్స్ అవ్వడం
5. వికారం ఎక్కువగా ఉన్నా తప్పక చూపించుకోవాలి… వారానికి లేదా పదిహేను రోజులకి కాకుండా రోజూ ఉంటే కచ్చితంగా డాక్టర్ ని కలవాలి.
6. జ్వరం వస్తున్నా- అధిక చెమట పడుతున్నా
7. యోని నుంచి వాసనతో కూడిన స్రావాలు వస్తే తప్పక చూపించుకోవాలి
8. రోజు తలనొప్పి, తరచూ మూర్ఛ వస్తున్నా జాగ్రత్త
9..మూత్రంలో మంటగా అనిపించినా,
10..యోనిలోంచి రక్తం వస్తే ఆలస్యం వద్దు
11.. బ్లీడింగ్ అవుతున్నా వెంటనే డాక్టర్ ని కలవాలి
12. మీకు రాషస్ వచ్చే ఫుడ్ పడని ఆహారం అసలు తీసుకోవద్దు
13..కడుపులో బిడ్డ కదలికలు తగ్గినా డాక్టర్ ని సంప్రదించాల్సిందే.