మనిషికి ఆరోగ్యం చాలా ముఖ్యం అయితే కొందరు జంక్ ఫుడ్ బాగా తింటారు దీని వల్ల ఒబెసిటీ కూడా పెరుగుతుంది, అందుకే లైట్ ఫుడ్ తీసుకున్నా మంచి డైట్ మంచి ఫుడ్ తీసుకోవాలి, ఇక చాలా మంది హెవీ ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటారు, కాని శారీరక శ్రమ వారు చేయరు.. దీని వల్ల మరింత చేటు, మనం ఎంత ప్రొటీన్ ఫుడ్ తింటే అంత శారీరక శ్రమ చేయాలి లేకపోతే డేంజర్.
ప్రోటీన్స్ మనకు కావాల్సిన ఎనర్జీని ఇస్తాయి. మన కండరాల్ని బలంగా చేస్తాయి. ప్రోటీన్స్ మన చర్మం, జుట్టుకి కూడా ఎంతో అవసరం. బరువు తగ్గేందుకు గట్టిగా ప్రయత్నించేవాళ్లు, కండరాల్ని పెంచుకోవాలి అనుకునేవాళ్లకు మాత్రమే ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఆహారం సెట్ అవుతుంది.
వర్క్ అవుట్లు ఎక్కువ చేసే వారు ప్రొటీణ్ పుడ్ తీసుకుంటే మేలు..పాలు, గుడ్లు, మాంసం, గింజలు, తృణధాన్యాల్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. అందుకే ఎవరైనా సరే కచ్చితంగా ప్రోటీన్స్ ఎంత అవసరమో అంతే తీసుకుంటూ… బరువు బ్యాలెన్సింగ్గా ఉండేలా చేసుకోవాలి.మరి ఎంత ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాలి అంటే కేజీ బాడీకి ఒక రోజుకి 0.8 గ్రాముల ప్రోటీన్స్ అవసరం.50 కేజీల బరువు ఉంటే… రోజూ 40 గ్రాముల ప్రోటీన్స్ తీసుకోవాలి. ఇంకా ఎక్కువ తీసుకోవడం వలన అధిక బరువు పెరుగుతారు అంటున్నారు వైద్యులు.