ఈ కరోనా సమయంలో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు, ఈ సమయంలో ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అందరూ… ఇక బయట ఫుడ్ ఎవరూ తినడం లేదు… అలాగే నగరంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పుచ్చకాయ తీసుకువస్తాడు, ఈ సమయంలో ఇంట్లో ఆయన భార్య తల్లితండ్రి అందరూ తిన్నారు..
అయితే ఆ ఇంజనీర్ ఒక్కగానొక్క కొడుకు ఆ సమయంలో పడుకున్నాడు, లేచిన తర్వాత ఆ బుడతడికి ఇద్దాము అని ఫ్రిజ్ లో పెట్టారు, అయితే సాయంత్రం నాలుగు గంటలకు ఆ ఐదేళ్ల కొడుక్కి పుచ్చకాయ పెట్టారు, అయితే నేరుగా ఆ బుడతడు పుచ్చకాయ ముక్కని ఫ్రిజ్ లో నుంచి తీసుకుని నోటిలో పెట్టుకున్నాడు.
అది ఐస్ తో గడ్డకట్టింది అతని గొంతులో ఇరక్కుంది, దీంతో అతను ఏమీ మాట్లాడలేకపోయాడు, వెంటనే అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తీసుకువెళ్లారు, అయితే ఐస్ కాకుండా అందులో గింజలు కూడా ఎక్కువ ఉన్నాయని ఆగొంతు దగ్గర ఇరుక్కుపోయింది అని దానిని బయటకు తీశారు డాక్టర్లు, మొత్తానికి అరగంట పాటు ఆ అబ్బాయి ఊపిరీతీసుకోలేక ఇబ్బంది పడ్డాడు, ఇలా డీ ఫ్రిజ్ లో ఫ్రూట్స్ పెట్టకూడదు అని డాక్టర్లు తెలిపారు, సో పిల్లలకు ఏదైనా పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి.