పుస్తెలమ్మి అయినా సరే పులస తినాలని చెబుతారు పెద్దలు. ముఖ్యంగా సీజన్ వచ్చింది అంటే గోదావరి జిల్లాల నుంచి ఈ పులస చేపలు దిల్లీ వరకూ వెళతాయి. అంతేకాదు పులస పులుసు చాలా ప్రాంతాలకు పంపిస్తారు. అంత రుచి ఉంటుంది ఈ పులస. ఎంత రేటు అయినా ఏడాదికి ఓసారి ఈ పులస తినాలి అని చాలా మంది ఎదురుచూస్తారు. ఈ కూర వండటంలో కూడా కొందరు ఎక్స్ పర్ట్ లు ఉంటారు.
ఈ సమయానికి పులస విక్రయాలతో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సందడి ఉండాలి. కాని ఈసారి అంత సందడి లేదు. సరైన సమయం వచ్చింది వరద వచ్చింది కాని పులసలు మాత్రం పెద్ద దొరకలేదు. దొరికిన పులసలు కూడా కేవలం 250 నుంచి 450 గ్రాములు ఉంటున్నాయి. మంచి దట్టమైన పులస కేజీ లేదా కేజిన్నర అయినా ఉండాలి వాటి కోసం చూస్తున్నారు జాలర్లు.
జూన్, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో మాత్రమే గోదావరిలో పులసల సందడి ఉంటుంది. అయితే ఈసారి పులస జాడలేదని జాలర్లు చాలా ఆవేదనతో ఉన్నారు. అందుకే ఈ నెలలో ఏమైనా దొరుకుతాయా అని చూస్తున్నారు జాలర్లు.