ఇప్పుడు కరోనా సమయం కాబట్టి చాలా మంది మంచి ఆహారం తీసుకుంటున్నారు, అలాగే వైద్యానికి నగదు అవసరం అవుతుంది అనే కంగారుతో ముందు జాగ్రత్త పడుతున్నారు, అయితే శానిటైజర్ మాస్క్ గ్లౌజులతో పాటు కొన్ని వస్తువులు చాలా జాగ్రత్తగా కొంటున్నారు, ఖరీదైనవి వాడుతున్నారు.
ఇప్పుడు కుటుంబంలో డిజిటల్ థర్మామీటర్ ప్రస్తుతం అందరూ వాడుతున్నారు. అయితే దీని ద్వారా కేవలం జ్వరం ఉందా లేదా అనేది మాత్రమే తెలుస్తుంది. అయితే దీని ద్వారా కరోనా ఉందా లేదా అనేది తెలుసుకోవడం దాదాపు అసాధ్యం.
ఇక చాలా మందికి కరోనా సోకితే వారికి ఆక్సిజన్ బ్రీతింగ్ ప్లాబ్లం కూడా వస్తోంది.. అందుకే ఇలా శరీరంలో తగ్గితే వెంటనే చెప్పేలా, పల్స్ ఆక్సీమీటర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆక్సీమీటర్ ద్వారా గుండె కొట్టుకునే వేగంతో పాటు శరీరానికి సరైన మొత్తంలో ఆక్సిజన్ అందుతోందో లేదో కనుగొనవచ్చు.
వీటిని ఇప్పుడు చాలా మంది కొంటున్నారు, ప్రతీ చిన్న క్లినిక్ లో కూడా డాక్టర్లు ఇప్పుడు వాడుతున్నారు.ఇది చిన్న క్లిప్ లా ఉంటుంది, ఇందులో మనం ఖాళీ ప్రాంతంలో చూపుడు వేలు పెట్టాలి
గుండె కొట్టుకునే వేగం, ఆక్సిజన్ స్థాయులు డిస్‌ప్లే అవుతాయి. ఇది సుమారు 2000 నుంచి 5000 వరకూ మార్కెట్లో ఉంది.