బిర్యానీతో పాటు పూరీ – ఈ రెస్టారెంట్ కి జనం క్యూ కడుతున్నారు

Puri along with Biryani People are queuing for this restaurant

0
107

సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనేక రకాల ఫుడ్స్ మనకు పరిచయం అవుతున్నాయి. ఏ ఊరిలో ఏ ఫుడ్ స్పెషలో అది కూడా వీడియోల్లో వస్తోంది. ఇక అనేక రకాల స్ట్రీట్ ఫుడ్స్ కూడా చాలా మందికి తెలుస్తున్నాయి. అయితే ఇటీవల బిర్యానీ అనేక రకాలుగా వండుతున్నారు. రోటీలు చపాతీలో కూడా బిర్యానీ పెట్టి కొన్ని రెస్టారెంట్లు సర్వ్ చేస్తున్నాయి. తాజాగా ఓ పూరీ గురించి వింటే ఆశ్చర్యం కలుగుతుంది మీకు. ఎందుకంటే ఇది మాములు పూరీ కాదు పూరీ విత్ బిర్యానీ.

లాల్భాయ్ పూరీలోకి వెజ్ బిర్యానీ సర్వ్ చేస్తున్నాడు. ఇది ఆ నోటా ఈనోటా జనానికి బాగా తెలిసింది. ఇది టేస్ట్ చేసేందుకు చాలా మంది జనం వస్తున్నారు. ఢిల్లీలోని ఫుడ్ లవర్స్ ఈ వీడియోలు ఫోటోలు తెగ షేర్ చేస్తున్నారు. మొదట పూరీతో ఆలుగడ్డ కూర ఇచ్చేవాడు అందరిలా కాకుండా వెరైటీగా చేద్దాం అని అనుకున్నాడు.

దీంతో వెజ్ బిర్యానీ అమ్మకం మొదలుపెట్టాడు. అయితే, కాస్త కొత్తగా ఆలోచించి బిర్యానీలోకి ఆలూకుర్మా తోపాటు పూరీలనూ ఇస్తున్నాడు. కస్టమర్లు ఈ రెండు టేస్ట్ చేస్తున్నారు. వేడి వేడి బిర్యానీని పూరీతో కలిపి తింటున్నారు కస్టమర్లు. ఇప్పుడు ఇతన్నీ చూసి చాలా మంది స్టార్ట్ చేస్తున్నారట. ఢిల్లీలో పూరి విత్ బిర్యానీ ఫేమస్ వంటకం అయింది.