రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు పెట్టుకోవడం దేనికో తెలుసా

రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు పెట్టుకోవడం దేనికో తెలుసా

0
158

ఈ స్రుష్టిలో సూర్యభగవానుడ్ని ప్రతీ ఒక్కరూ కొలుస్తారు, ఆయన లేనిదే స్రుష్టి లేదు అంటారు, రథసప్తమి రోజున స్వామికి పూజలు చేస్తారు, సూర్యభగవానుడికి అర్కుడు అనే పేరుంది. అందువల్లనే ఆయనకి అర్కపత్రం జిల్లేడు ఆకు ప్రీతికరమైనదని అంటారు.

అందుకే రథసప్తమి పర్వదినం రోజున తలపై ఏడు జిల్లేడు ఆకులు పెట్టుకుని తలస్నానం చేస్తారు, ఆరోజు స్వామిని దర్శించుకుంటారు.. సూర్యకిరణాలు పడే సమయానికి స్నానం ఆచరిస్తారు, అప్పుడు కిరణాల వెలుగులు మనపై వచ్చేలా స్వామిని దర్శించుకుంటారు.

ఈ కారణంగానే రథసప్తమి రోజున తలపై ఏడు జిల్లేడు ఆకులు పెట్టుకుని తలస్నానం చేస్తారు. కొత్తబట్టలు ధరించి భక్తిశ్రద్ధలతో సూర్యభగవానుడిని పూజిస్తారు. కొత్త బియ్యం బెల్లం వేసి పాయసం చేస్తారు. ఇది నైవేద్యంగా దేవుడికి పెడతారు. ప్రకృతి ద్వారా తమకి కావలసిన ఆహార పదార్థాలను అందిస్తోన్న సూర్యనారాయణమూర్తికి ఇది కృతజ్ఞతలు తెలియజేయడం లాంటిదని రైతుల నుంచి ఇలా ప్రసాదంగా పెట్టేవారు… అలాగే జిల్లేడు ఆకులు తలపై పెట్టుకుని స్నానం చేయడం వల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి.