ఈ కరోనా భయంతో ప్రతీ ఒక్కరు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బయటకు వెళితే మాస్క్ శానిటైజర్ వాడుతున్నారు ఏదైనా బయట నుంచి కూరగాయలు పండ్లు తీసుకువచ్చినా పూర్తిగా నీటిలో కడుగుతున్నారు. అయితే మరికొందరు లిక్విడ్లతో, సబ్బుతో శుభ్రం చేస్తున్నారు.
వైరస్ లు , ఇతర సూక్ష్మక్రిములను దూరం చేసుకునేందుకు చాలా మంది వీటిని వాడుతున్నారు.
నిపుణులు కొన్ని విషయాలు చెబుతున్నారు తెలుసుకోండి. కూరగాయలు, పండ్లను సబ్బు, డిటర్జెంట్లు, సర్ఫ్, డెటాల్, శానిటైజర్లు, వీటితో కడగకండి అని చెబుతున్నారు. ఇవన్నీ మన పొట్టలోకి పోయి మరింత చేటు చేస్తాయి. వీటివల్ల వాంతులు విరోచనాలు గ్యాస్ నొప్పి వస్తాయి. మీరు వీటిని తీసుకువచ్చిన వెంటనే కుళాయి కింద పెట్టి మెల్లగా నీరు పోస్తూ కడగాలి. వీటిపై ఉన్న వైరస్ దుమ్ము అంతా బయటకు పోతుంది.
ఇక ఉప్పు నీటిలో కడిగినా చాలా మంచిది. మీరు ఆకుకూరలు కడగాలి అంటే పెద్ద పాత్రలో నీరు పోసి అందులో చిటికెడు ఉప్పు వేయండి పురుగులు ఉంటే ఆ కుకూరల నుంచి బయటకు వస్తాయి. కూరగాయలను చల్లనీటితో కడగడం మంచిది.