నూనెలో బాగా ఫ్రై చేసిన చిప్స్ తింటున్నారా కచ్చితంగా ఇది చదవండి

Read this if you eat chips fried well in oil

0
103

ఈ రోజుల్లో చాలా మంది బంగాళాదుంప చిప్స్ ని అతిగా తింటున్నారు. ఎక్కడ చూసినా కరకరలాడే ఈ చిప్స్ షాపులు కనిపిస్తున్నాయి. సినిమా థియేటర్లలో కూడా ఈ చిప్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఇక వీటికి అడిక్ట్ అయితే మానడం చాలా కష్టం. ముఖ్యంగా పెద్దలు కాదు చిన్నపిల్లలు వీటికి ఈ మధ్య బాగా అలవాటు పడుతున్నారు. ఇక చిప్స్ ఇవ్వకపోతే మారాం చేస్తున్నారు.

అయితే వీటి వల్ల మనకు ఆరోగ్యం పాడవుతుందని చెబుతున్నారు వైద్యులు. ఏదో ఒకసారి మీరు ఇవి తీసుకుంటే పర్వాలేదు కాని, నిత్యం ఇవే తింటే శరీరానికి మీరే చేటు చేస్తున్నట్లు.
మీరు ఏ వస్తువు అయినా నూనెలో వేగించిన తర్వాత అందులో ఎటువంటి పోషకాలు ఉండవు.నూనెలో వేగించటం వలన వాటిలో ఉండే పోషకాలు నశిస్తాయి. అందుకే ఉడకబెట్టిన కూరలు ఎక్కువగా తీసుకుంటాం.

చిప్స్ లో హైఫ్యాట్ కెలోరీలు ఉంటాయి. బాగా ఫ్యాట్, పొట్ట, అధిక బరువు, ఊబకాయ సమస్య పెరుగుతుంది.ఇలాంటి చిప్స్ లో సోడియం అధిక మొత్తంలో ఉంటుంది. అందుకే బీపీ సమస్య వస్తుంది. చిన్నపిల్లలకు ఊబకాయం సమస్య దీని వల్లే వస్తుంది. ఇక కొలెస్ట్రాల్ వద్దు అన్నా పెరిగిపోతూనే ఉంటుంది. అందుకే వీటికి బదులు పండ్లు, సలాడ్స్ తీసుకుంటే మంచిది.