మొక్కలు ఏపుగా పెరగడానికి మన ఇంట్లో చాలా మంది ఎగ్ షెల్స్ అలాగే ఉల్లి వెల్లులి తొక్కలు వేస్తూ ఉంటారు, ఇలా వేయడం వల్ల అసలు ఫలితం ఉంటుందా గులాబీ మొక్క పెరగడానికి ఎగ్ షెల్ క్రష్ పొడి ఉపయోగపడుతుందా అంటే, అవును బెస్ట్ అంటున్నారు పెంపకం దారులు, దీని వల్ల మొక్కకి బలం వస్తుంది.. గులాబీ ఏపుగా పెరుగుతుంది ఉల్లి ఎగ్ షెల్ క్రష్ వల్ల..
వంటింట్లో ఉల్లి రోజువారీ వంటకాల్లో వాడుతూ ఉంటాం. వీటిని ఫెర్టిలైజర్స్ గా కూడా వాడితే హోమ్ గార్డెన్ కు మంచి పోషణ లభిస్తుంది. అయితే నేరుగా తొక్కలే కాదు ఆ ఉల్లి తొక్కలను నీటిలో ఉంచి నాలుగు రోజులు ఉంచండి, తర్వాత ఆ వాటర్ వడగట్టండి. తర్వాత ఇంకో లీటర్ నీటిలో డైల్యూట్ చేయాలి.
ఆ తరువాత ఈ నీటితో మొక్కలకు నీళ్లు పోయాలి. ఆనియన్ పీల్ లో పొటాషియం, కాల్షియం అలాగే ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మొక్కల పెరుగుదలకు హెల్ప్ చేస్తాయి. ఇక నేరుగా ఉల్లి వేసేకంటే ఇది చాలా మేలు ఓసారి ట్రై చేయండి.