ఆషాడం వచ్చింది అంటే చాలు కొత్తగా వివాహం అయిన జంటలు ఇక కాస్త ఎడంగా ఉంటాయి, అంటే ఆమె పుట్టింటికి వెళుతుంది, అతను తన తల్లిగారి ఇంటిలో ఉంటాడు, ఇలా ఆషాడం అంతా ఆమె తల్లిగారి ఇంటిలో ఉంటుంది, ఈ సమయంలో అమ్మాయిలు కొత్త కోడళ్లు చాలా మంది గోరింటాకు పెట్టుకుంటారు.
ఎర్రగా పండిన చేతిని కాళ్లని చూసి మురిసిపోతుంటారు. ఈ ఆషాడమాసంలో వర్షాలు కురిసే సమయం దీంతో అప్పటి వరకూ ఎండగా ఉన్న వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోతుంది, ఈ సమయంలో వాన నీరు ఉండటం వల్ల అనేక అంటు రోగాలు వస్తాయి, అయితే మన శరీరం మాత్రం చాలా వేడిగా ఉంటుంది.
దీని వల్ల ఇంకా జలుబు జ్వరం లాంటి సమస్యలు వస్తాయి, ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటే ఒంటికి చలువు చేస్తుంది, అలాగే గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది.
ఇది రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే దీనిని ఆడవారు ఈ సమయంలో పెట్టుకుంటారు,ఇక నీరు పట్టడం వల్ల ఇంటి పని చేయడం వల్ల నీరు కూడా చేతి గోళ్లకు చేతికి కాళ్లకి ఉంటుంది, దీని వల్ల పాదాల పగుళ్లు వస్తాయి, ఈ గాయాలు తగ్గాలి అంటే ఆ మంట ఉండకూడదు అంటే గోరింటాకు పెట్టుకోవాలి అని పెద్దలు ఆనాటి నుంచి చెప్పారు.. ఈ నాటి వరకూ అందరూ పాటిస్తున్నారు.