ఎర్ర బెండకాయ మీరు ఎప్పుడైనా చూశారా ఏమిటి దీని స్పెషల్

Red Bendi is what makes you special what you've ever seen

0
96

బెండకాయ ప్రతీ ఒక్కరికి ఇష్టమే. బెండకాయ అంటే పిల్లలనుంచి పెద్దల వరకూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఇది తింటే పిలల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెబుతారు వైద్యులు, అంతేకాదు పెద్దలకైతే కీళ్ల నొప్పుల నుంచి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని వైద్యులు చెబుతారు. ఇక పులుసు, కూర, ఫ్రై ఇలా బెండతో అనేక రకాల కూరలు వండుతారు. ఇక బెండ ఆవకాయ కూడా కొందరు పెడుతున్నారు. ఇక బెండకాయ బజ్జీలు కూడా తినేవారు ఉన్నారు.

సాధారణంగా బెండకాయ రంగు ఏది అంటే ఆకుపచ్చ రంగు అంటాం. ఇక్కడ బెండకాయ ఎరుపు రంగులో ఉంది.ఈ అరుదైన పంట కొందరు పండిస్తున్నారు. ఈ వంగడాన్ని రాధిక అని పిలుస్తారట. ఇక మార్కెట్లో వీటికి డిమాండ్ పెరుగుతోంది. అయితే అన్ని ప్రాంతాల్లో ఇది ఈజీగా సాగు అవుతుందా అంటే దీనికి ఓ విషయం చెబుతున్నారు.

ఈ బెండకాయ ఎక్కువగా చలి ప్రాంతాల్లో సాగు చేయడానికి అనుకూలమని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు.దీని వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఇక రక్తహీనత సమస్య ఉన్నవారు ఎవరైనా దీనిని తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.