కొందరు ఏదైనా తింటే కాస్త తేడా చేసినా జలుబు చేసినా వేడి చేసింది మాకు అంటారు, ముఖ్యంగా మనం తినే ఆహారం మనం చేసే పని కూడా ఇందులో చూడాలి.. దీని వల్ల కూడా శరీరానికి వేడి చేస్తుంది, ఇక సమ్మర్ లో ఈసమస్య చాలా మందికి వేధిస్తుంది, ఇక మసాలా లాంటి ఫుడ్ తీసుకున్నా ఇలా ఇబ్బంది పడినవారు కొందరు ఉంటారు.
మీకు శరీరంలో ఇలా అధిక వేడి ఉంటే తరచూ తలనొప్పి, మలబద్దకం, నీరసం సమస్యలు వస్తాయి, చిన్న చిట్కాలతో ఈ సమస్య తగ్గించుకోవచ్చు, ముఖ్యంగా ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవద్దు, ఏసీలో ఉన్నా గంటకి ఓసారి అయినా బయటకు తిరగండి.
అందుకే తరచుగా నీళ్లు తాగండి మీరు కచ్చితంగా రోజుకి ఐదు లీటర్ల నీరు తాగాల్సిందే, ఇక మెంతులు నానబెట్టి తిన్నా చాలా మంచిది ..ముఖ్యంగా స్పూన్ మెంతులు తీసుకుంటే శరీరంలో వ్యర్దాలు పోతాయి. అంతేకాదు బాడీ చల్లబడుతుంది. కొబ్బరి నీరు చల్లని మజ్జిగ తీసుకోండి, జ్యూస్ లు ఐస్ తీసుకోవద్దు, కూల్ డ్రింకులు ఇంకా వేడిచేస్తాయి ఇవి వద్దు..
|
|
|
మీకు వేడి చేస్తోందా ఈ చిట్కాలతో తగ్గించుకోండి
-